![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -256 లో..... దాస్ ఎక్కడ నేను అసలైన వారసురాలిని కాదన్న విషయం చెప్తాడేమోనన్న జ్యోత్స్న.. తన తలపైన కొడుతుంది. అది దశరత్ చూస్తాడు. ఎవరైనా చూస్తారేమోనని దాస్ ని బలవంతంగా జ్యోత్స్న తన కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంది. జ్యోత్స్న ఎందుకు కొట్టింది ఎక్కడికి తీసుకొని వెళ్తుందని దశరథ్ తననే ఫాలో అవుతూ వెనకాలే వెళ్తాడు.
జ్యోత్స్న ఒక దగ్గరికి దాస్ ని తీసుకొని వెళ్లి.. వీడు ఇంకా చావలేదు. వీడు బ్రతికుంటే నా గురించి నిజం చెప్తాడని రాయితో కొట్టబోతుంటే దశరథ్ చాటు నుండి హారన్ సౌండ్ చేస్తాడు. దాంతో ఎవరో వస్తున్నారని జ్యోత్స్న పారిపోతుంది. వెంటనే దశరథ్ వచ్చి దాస్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు డాక్టర్ అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు కార్తీక్. దీపకి ఏం చెప్పాలో ఏంటోనని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు సుమిత్రని గదిలో ఉండగా బయట నుండి జ్యోత్స్న గడియపెడుతుంది. సుమిత్ర డోర్ కొట్టడంతో పారిజాతం డోర్ తీస్తుంది. ఎవరు గడియ పెట్టారని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే జ్యోత్స్న కంగారుగా ఇంటికి వస్తుంది.
మరొకవైపు జ్యోత్స్న చేసిన పనికి దశరథ్ ఇంకా షాక్ లోనే ఉంటాడు. అపుడే డాక్టర్ వచ్చి తన కండిషన్ బాగోలేదు. సీరియస్ అని చెప్తాడు. ఒరేయ్ వాడు నా తమ్ముడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వాడు బాగుండాలని దశరథ్ తన ఫ్రెండ్ అయిన డాక్టర్ కి చెప్తాడు. దాస్ దగ్గరికి దశరథ్ వెళ్లి.. నువ్వు నాతో చెప్పాలనుకున్న విషయమేంటి.. జ్యోత్స్న ఎందుకు నిన్ను చంపాలనుకున్నది.. నువ్వే చెప్పాలి అప్పటి వరకు ఎవరిని అడగనని దశరత్ అనుకుంటాడు. మరొకవైపు శౌర్యకి ఏమైందని దీప అడుగుతుంది. ఏం లేదని కార్తీక్ కవర్ చేస్తాడు. ఆపరేషన్ కి యాభై లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు కార్తీక్. మరొకవైపు జ్యోత్స్న కంగారుగా డాడ్ ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడే దశరథ్ వస్తాడు. డాడ్ ఏంటి నావైపు కోపంగా చూస్తున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |